దేవుని ప్రేమ పూర్వక కాపుదల
రామ్ తో నేను సంభాషిస్తూ వుండగా పరిశుద్దాత్మ ఒక ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆయన ఇలా అన్నాడు : సాధారణంగా మనుష్యులకు ప్రమాదాలు అనేవి ఏదో పెద్ద హిమాలయ పర్వతపు అంచు నుండి పడిపోతేనే జరుగుతాయి అనుకోకూడదు. ప్రమాదాలు చాలాసార్లు, చిన్న రాయియే కదా అనుకొని నిర్లక్ష్యంగా ఉండి, ఆ రాయి తగులు కొని అవాంచనీయ ప్రమాదాలు, కొన్నిసార్లు తీరని నష్టం (ప్రాణ నష్టం) సంభవిస్తూ వుంటాయి.
జీవన ప్రయాణంలో అలాంటి, ప్రమాదకరంగా కనబడని రాళ్ళను మన మార్గంలో తప్పించుకొనుటకు మనకు జ్ఞానం అవసరము.
మనలను మన జీవిత మార్గంలో కాపాడుటకు యేసు మన పట్ల ఎంతో శ్రద్ద గలవాడని పరిశుద్దాత్ముడు నాకు జ్ఞాపకం చేశాడు.
మనము మన జీవన మార్గము గురించి శ్రద్ద కలిగి వుంటే, యేసు మన గురించి శ్రద్ద కలిగి వుంటాడు.
► నేను వెళ్ళు స్థలములన్నిటిలో నన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞపించునని నేను నమ్మి ప్రకటిస్తున్నాను. ( కీర్తన 91:11)
► సమస్త కీడు నుండి దేవుని దూతలు నన్ను కాపాడుతూ వుంటారు. (కీర్తన 91:11)
► నా పాదాములకు రాయి తగులకుండ దేవదూతలు నన్ను తమ చేతులతో ఎత్తుకొందురు. ( కీర్తన 91:12)
► నేను చిక్కబడకుండునట్లునూ, పడిపొకుండునట్లునూ దేవుని దూతలు నన్ను కాపాడుదురు. ( కీర్తన 91: 12)
► తల్లి తన పిల్లలను ఎత్తుకొనునట్లు, ఈ మహిమ గల దేవదూతలు ప్రేమాసక్తితో నన్ను మోసి కొని పొవుదురు. ( కీర్తన 91: 12)
► చిన్న చిన్న ప్రమాదాల నుండి దేవుని జ్ఞానం వలన మేము కాపాడబడతాము.( కీర్తన 91:12)
► నేను చిన్న ప్రమాదాల నుండి, స్వల్ప కీడుల నుండి కాపాడబడుదునని నమ్ముతూ, ప్రకటించుచూ, శాసించుచున్నాను.
యేసయ్య నీ ప్రేమ నన్ను కాపాడుతుంది, విమోచిస్తుంది, విదిపిస్తుంది, రక్షిస్తుంది కావున మీకు వందనాలు. – ఆమేన్.
ఈ ప్రవచనాత్మక ప్రకటన మీకు ఆశీర్వాదకరంగా వున్నట్లయితే, ఈ పరిచర్య ను బలపరచ గోరినచో క్రింది “donate” అనే చోట క్లిక్ చేయండి.
ఇండియన్ క్రెడిట్/ డెబిట్ కార్డ్స్ అండ్ వాల్లెట్స్
ఇంటర్నేషనల్ పేపాల్ అండ్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్